*భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం*
సెప్టెంబర్ 01(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి యారాల మాధవరెడ్డి )భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తెలిపారు శనివారం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ఫార్మర్లకు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 9492409781 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీ ఎంపీడీవో కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఏవైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే ఈ నెంబర్లో సంప్రదించగలరని కలెక్టర్ సూచించారు.