logo

సినీ సంగీత ప్రియులను మరొకమారు అలరించనున్న "స్వర బృందావనం" ద్వితీయ సంగీత విభావరి. - తూములూరి శ్రీ కుమార్

స్వర బృందావనం రెండవ సంగీత విభావరితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోవడమే తమ సంస్థ యొక్క లక్ష్యం అని, అందుకే అద్భుతమైన గాయనీ గాయకులతో నెలకి కనీసం రెండు కార్యక్రమాలన్నా చేయాలని సంకల్పించామని స్వర బృందావనం వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ బృందావనం రవికాంత్ అన్నారు.

గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 15న నిర్వహించిన తమ సంస్థ యొక్క ప్రథమ కార్యక్రమం విజయవంతం అయ్యిందని, అలాగే ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందని, యూట్యూబ్ లైవ్ ద్వారా 850 పైగా సినీ సంగీత అభిమానులు తమ కార్యక్రమాన్ని వీక్షించడం ఎంతో ఆనందదాయకం అని శ్రీ రవికాంత్ తెలిపారు.

తమ రెండవ సంగీత విభావరి కార్యక్రమానికి నూతన పరిచయంగా శ్రీమతి బుర్రా రమా సుందరి, శ్రీమతి సేలం శ్రీదేవి, శ్రీమతి సీతాకుమారి, శ్రీ మల్లికార్జున్ మరియూ శ్రీ దాము మహేంద్ర లను పరిచయం చేయబోతున్నామని, వీరితోపాటు గాయకులు శ్రీ శరత్ కృష్ణ, శ్రీ రాంబాబు, శ్రీ తూములూరి శ్రీ కుమార్, శ్రీ బృందావనం రవికాంత్ అలాగే గాయనీమణులు శ్రీమతి డా.దాము రాజేశ్వరి గారు, శ్రీమతి పసుమర్తి సీతా గారు, శ్రీమతి సమీరా గారు పల్గొనబోతున్నట్టు శ్రీ రవికాంత్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ వద్ద కళా భారతి సిటీ కల్చరల్ హాల్ లో నేటి మధ్యాహ్నం 12:00 నుంచీ సాయంత్రం 5:00 వరకు తమ కార్యక్రమం జరుగుతుందని అలాగే యూట్యూబ్ లో Cultural TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని స్వర బృందావనం అధ్యక్షులు రవికాంత్ తెలిపారు.

-తూములూరి శ్రీ కుమార్

55
8839 views