ఆర్ & బి మంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే బత్తుల
ది.27-08-2024 మంగళవారం నాడు అమరావతి సచివాలయంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి శ్రీ బి.సి.జనార్దన్ రెడ్డిని కలిసి రాజానగరం నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు.
ఈ చర్చల్లో భాగంగా R&B మరియు రాష్ట్ర హైవే రోడ్ల కాలానుగుణ నిర్వహణ మరియు మరమ్మతులు (అంచనా రూ. 135.35 కోట్లు) కొరకు రాజమండ్రి - చినకొండేపూడి రోడ్డుకు 104.00 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి కొరకు బొబ్బిలిలంకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం (అంచనా రూ. 2.37 కోట్లు) నిర్మాణానికి చెల్లింపుల క్లియరెన్స్ కొరకు
NDB (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్) చేపట్టిన పనులు - భూ సేకరణ సమస్యలు పరిష్కారం కొరకు రాఘవపురం నుండి గోకవరం వెళ్లే రోడ్ - మంజూరైన రహదారికి టెండర్ కాల్ 12.276 కి.మీ. కొరకు రాజానగరం నుండి గాదరాడ, కాపవరం నుండి వెళ్లే ముగ్గళ్ల రోడ్లు పెండింగ్ బిల్లుల కొరకు మల్లంపూడి నుంచి పేరరామచంద్రపురం రోడ్డు పనులు పూర్తి చేసేందుకు పెండింగ్ బిల్లులు విడుదల చేయుట కొరకుచర్చించి సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ