ఎస్ఐని సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బదిలీపై వచ్చిన ఎస్ఐ నరేష్ గౌడ్ ను రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్సై నరేష్ గౌడ్ మాట్లాడుతూ, శాంతిభద్రతలులకు విఘాతం కలిగించే విధంగా ఏవైనా ప్రవర్తించిన చో ఎవరినైనా ఉపేక్షిస్తే ప్రసక్తి లేదన్నారు. అందరిలో సహాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు ఎవరికి నష్టం చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. అనంతరం తాసిల్దార్ సువర్ణ కు ఘనంగా సన్మానించారు అనంతరం తాసిల్దార్ సువర్ణ మాట్లాడుతూ మండలంలో గెట్ పంచాయతీలు చేయకుండా మంచితనంతో ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని అన్నారు ఎదుటివారికి నష్టం చేస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కిషన్ యాదవ్ తూర్పురాజు తదితరులు పాల్గొన్నారు