
4లక్షల రూ ఇంటికి ఏ పి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో
*శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు & పాతపట్నం మాజీ శాసనసభ్యులు శ్రీ కలమట వెంకటరమణ మూర్తి గారు..*
*-ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు కీలక హామీలపై సంతకం చేసి వేలాదిమంది నిరుద్యోగులు, రైతులు, పింఛన్దార్లు, యువత, పేదలకు లబ్ది చేకూర్చిన దర్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.*
*- పేదలందరికి పక్క ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ నూతన అధ్యయనం- కలమట*
*- గ్రామాల్లో ఇల్లు లేని వారికీ మూడు సెంట్లు స్థలం, పట్టణాల్లో అయితే రెండు సెంట్లు స్థలం మంజూరు చేయనున్న నూతన ప్రభుత్వం.*
*-కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల అర్థిక సహాయం ఇవ్వనున్నారు.*
*- గత ప్రభుత్వంలో మధ్యంతరంగా నిలిపివేసిన ఇల్లును పూర్తీ స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది, 2014-19 సంవత్సరం నిర్మాణం చేపట్టిన ఇల్లులకు నిలిపివేషిన బిల్లులు మరల పూర్తీ స్థాయిలో అర్హులందరికీ అందచేయనున్నారు.*
*- 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పేదలందరి కలలపై నీళ్లు పోసింది, పేదలందరికి రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి కనీసం 30వేల ఇళ్ళు కూడా నిర్మాణం చేపట్టలేకపోయారు.*