logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

త్వరలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు.

#Andhrapradesh
#NCBN

143
1181 views

Comment