logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యార్థిని విదేశీ విద్యకు నారా లోకేష్ సాయం

కష్టాల్లో ఉన్నామని అంటే చాలు... క్షణం ఆలోచించకుండా తనవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్. ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న మేర చేయూతనిస్తూ.. నేనున్నానని వారికి భరోసా ఇస్తున్నారు.

అందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన కాకాణికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ (ఫిజిషీయన్) 4వ సంవత్సరం చదువుతోంది. గత ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా కార్తీకకు విదేశీ విద్య సాయం అందలేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమబిడ్డ చదువుకు సాయం అందించాల్సిందిగా ఇటీవల కార్తీక తండ్రి శ్రీనివాసరావు ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్‌కి వినతిపత్రం అందించారు. ట్యూషన్ ఫీజుకు అవసరమైన రూ.1.43 లక్షలను సొంత నిధుల నుంచి కార్తీకకు అందజేశారు. తొలుత ట్యూషన్ పీజు చెల్లించి కళాశాలకు వెళ్లాలని, విదేశీవిద్య పథకానికి నూతన మార్గదర్శకాలు రూపొందించాక ప్రభుత్వం ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

#NaraLokesh
#AndhraPradesh

123
3425 views

Comment