
మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా : పురపాలక సంఘ కామారెడ్డి పట్టణ పరిధిలో గల ఇందిరా నగర్ కాలనీ డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద “డ్రై డే ప్రై డే కార్యక్రమములో” భాగంగా జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ సందర్శించడం జరిగిందని తెలిపారు . అట్టి కాలనీలో మురికి కాలువలు శుబ్రముగా చేయుమని ఆదేశించడం జరిగిందని చెప్పారు.కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అట్టి మురికి కాలువలు శుబ్రపర్చడం జరిగిందని అన్రానారు .రామారెడ్డి రోడ్డుకు ఇరువైపుల మురికి కుప్పలు తొలగించి మొక్కలు నాటుమని మరియు రంగవల్లులు చేయించవలసినదిగా ఆదేశించినారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో పెనాల్టిలు విధించుమని పురపాలక సిబ్బందికి ఆదేశించినారు మరియు DRCC సెంటర్ ను కూడా సందర్శించిడం జరిగినది అదేవిధముగా పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ సందర్శించి, చుట్టు ప్రక్కల పరిసరాలను క్లీన్ చేయించవలసినదిగా ఆదేశించినారు.
ఈ కార్యక్రమములో శ్రీయుత శ్రీ.ఆశిష్ సాంగ్వాన్, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, కామారెడ్డి, శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చైర్ పర్సన్ పురపాలక సంఘము కామారెడ్డి, రెవిన్యూ డివిజినల్ అధికారి కామారెడ్డి గారు, మండల రెవిన్యూ అధికారి కామారెడ్డి , గౌరవ సభ్యులు, శ్రీమతి K. సుజాత, కమీషనర్, పురపాలక సంఘం కామారెడ్డి మరియు అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.