logo

బడ్జెట్పై మిత్తి రెడ్డి హర్షం

"వికసిత భారత్ - వికసిత ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ ఇది"

భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు మాట్లాడుతూ మన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు 2024 - 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు, దేశంలో ఉన్న పేదలు, యువత, రైతులు, మరియు నారీమణులు ఈ నాలుగు రంగాలు చెందిన వారిని మూల స్తంభాలుగా చేసుకుని వార్షిక బడ్జెట్ ని రూపొందించడం జరిగిందన్నారు, ఈ బడ్జెట్లో చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ఆర్థిక సాయం, తద్వారా ఉద్యోగ కల్పన అందించడం జరుగుతుందన్నారు, ఉన్నత చదువులు చదువుతున్న యువతకు రుణాలు, ఈ బడ్జెట్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కొత్తగా మూడు కోట్లు ఉచిత గృహాల నిర్మాణం,
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలైన బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ మరియు మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు, ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఈ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగింది, దేశంలో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అన్నారు, ఈ దేశం యొక్క "దశ, దిశ" మారుతుందన్నారు, తద్వారా మోదీ గారి సంకల్పం వికసితభారత్@2047 సహకారమవుతుందన్నారు.

1
6073 views