logo

*కోరుట్ల లో ''వనమహోత్సవం''* గ్లోబల్ వార్మింగ్ మరియు పొల్యూషన్ ని వారించాలంటే చెట్లు నాటడం తో పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలం

*కోరుట్ల లో ''వనమహోత్సవం''*
గ్లోబల్ వార్మింగ్ మరియు పొల్యూషన్ ని వారించాలంటే చెట్లు నాటడం తో పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలం

ఈరోజు కోరుట్ల పట్టణంలో ఏకీన్పూర్ నందుగల సాయిబాబా మందిరం సమీపంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా టెకోమ, వేప,కానుగ, గుల్మోర్ వంటి మొక్కలు నాటి వాటి రక్షణ కోసం ట్రీ గార్డ్స్ అమర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంను ఉద్దేశించి కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య గారు మరియు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ వనమహోత్సవం కార్యక్రమంను ఒక బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి, నాటడమే కాకుండా వాటి సంరక్షణకు పాటుపడాలని అలా వాటిని సంరక్షించినప్పుడే వనమహోత్సవం విజయవంతం అవుతుందని అంతేకాకుండా పర్యావరణంకు మేలు జరుగుతుందని వారు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య గారు, వైస్ చైర్ పర్సన్ గడ్డమీద పవన్ గారు, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి గారు, వార్డ్ కౌన్సిలర్ బద్ది సుజాత గారు మరియు వార్డ్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

28
5393 views