అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పట్టణంలోని హిందూ ధార్మిక సంఘాల సభ్యులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు
Jagitial dist, Raikal
మూడు నెలలు గడిచిన అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సోమవారం పట్టణంలోని హిందూ ధార్మిక సంఘాల సభ్యులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పోచమ్మ గుడి ముందు గతంలో అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని మునిసిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గత కొన్ని సంవత్సరాల నుండి సంబంధిత నిర్మాణం ముందు హిందువుల ఆరాధ్య దైవం శివునికి అర్జించే బిల్వపత్ర వృక్షాన్ని కూడా సంబంధిత వ్యక్తి నరికి వేయడం పై తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే అక్రమ నిర్మాణాన్ని చట్ట ప్రకారం తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల సభ్యులు మరియు కుల సంఘాల సభ్యులు కాయితి గంగాధర్, పందిరి లక్ష్మీనారాయణ, గంగాధర్, సామల సతీష్, జోగా రవీందర్, వినయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు