logo

ఏలూరు కోటదిబ్బ ఎస్‌ఆర్‌వన్ వద్ద ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ 35వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు

ఏలూరు - జూలై, 05...

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి, ప్రజలకు ప్రజానాయకులు అనుసంధానకర్తలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ పాలనపై సమ్మెముద్రలు, ప్రజానిందలు రాకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్‌ కార్మికవర్గంపై ఉందని అన్నారు. ఏలూరు కోటదిబ్బ ఎస్‌ఆర్‌వన్ వద్ద ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ 35వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ పతాకాన్ని యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా నగర ప్రజానీకానికి మంచినీటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటర్ సప్లై, వాటర్ వర్క్స్ ఉద్యోగ సిబ్బందిపై ఉందని అన్నారు. ఉద్యోగ, సిబ్బంది ఏం మాత్రం అలసత్వం వహించిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, అటువంటి పరిస్థితుల్ని తీసుకురావద్దని ఆయన సూచించారు. ఉద్యోగ, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే యూనియన్ నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ లో సుమారు వెయ్యి మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది పనిచేస్తున్నారని, వారందరినీ సర్వీస్ సీనియార్టీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈ పి కొండలరావు, డిఈఈ తాతబ్బాయి, ఏఈ సాయి, యూనియన్ వ్యవస్థాపకులు చిలుకూరి రమేష్ కుమార్, జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు, యూనియన్ నాయకులు పివి రమణ, బి నారాయణరావు, ఎస్ఎంవిసుబ్బారావు, ఎస్ శ్రీనివాస్, సిహెచ్ హరినాథ్, డి వెంకటేశ్వరరావు, వెంకటేష్, ఎస్కే ఆలీ, సయ్యద్ బాజీ, కే శ్రీనివాస్, డి అప్పారావు, డి దుర్గాప్రసాద్, సిహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటారు.

0
5383 views