Cipet
టెన్త్ సప్లిమెంటరీ పాసైన విద్యార్థులకు సీపెట్ (CIPET ) లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం
రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త వచ్చింది. విజయవాడలో ఉన్న జాతీయ విద్యా సంస్థ సీపెట్‌లో చేరేందుకు ప్రత్యేక అవకాశం లభించింది. దరఖాస్తు చేసుకునేందుకు జులై 7 (ఆదివారం) ఆఖరు తేదీగా ఆ విద్యా సంస్థ వెల్లడించింది.
పదో తరగతి సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని కోరింది. విజయవాడలో ఉన్న భారత ప్రభుత్వ విద్యా సంస్థ సెంట్రల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (సీపెట్)లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల్లో ప్రత్యేక అవకాశ కల్పిస్తుంది
డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం అవకాశం కల్పించారు. ఈ రెండు కోర్సుల్లో ఒక్కో కోర్సు మూడేళ్ల వ్యవధితో ఈ కోర్సులు ఉంటాయి.
ఈ కోర్సులకు సీటు కోసం ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినీ, విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి, నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి "ఫీజు రీయింబర్స్మెంట్" సదుపాయాలు ఉన్నాయని, పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది
ప్లాస్టిక్స్ రంగంలో బహుళ జాతి సంస్థ (ఎంఎన్‌సీ)లు, అనుబంధ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ అండ్ మేకర్, జూనియర్ ఇంజినీర్ (మైంటెనెన్స్) వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
రెండేళ్లు కోర్సులు
రెండేళ్ల డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు సీపెట్ దరఖాస్తులను ఆహ్వానించింది.
దరఖాస్తు చేసుకోవడానికి జులై 31న తుది గడువు నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు అన్ని కేటగిరీలకు రూ.100 ఉంది. అయితే ఇది రిఫండబుల్ కాదు. మెరిట్ ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.
ఈ కోర్సుల్లో చేరేందుకు 10+2తో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బయోలజీ, ఇన్‌ఫర్మేషన్ ప్రాక్టీస్, బయోటెక్నాలజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జిక్ట్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్ చేయాల్సి ఉంది. లేదా 10+ రెండేళ్లు ఐటీఐ కోర్సు చేస్తే డైరెక్టగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో రెండో సంవత్సరంలోనే చేరవచ్చు.
సమచారం కోసం ఫోన్ నంబర్లు 9440531978, 7229004049ను సంప్రదించాలి. అలాగే ఈ మెయిల.
ది పెరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
( రిజిస్ట్రేషన్ నంబరు 6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ