logo

మెగా వైద్య శిభిరం...! పాల్గొన్న ఎఎస్పీ సురేందర్ రావు...

అదిలాబాద్ జిల్లా//
గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గిరిజన గ్రామంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశానుసారం మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎఎస్పీ సురేందర్ రావు.
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేశామని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరానికి ప్రజల నుండి భారీ స్పందన లభించిందని రోగులు భారీగా తరలివచ్చి పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లో మహిళా డాక్టర్లు గర్భిణీ స్త్రీలకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు, దీర్ఘకాలిక రోగులకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ లాంటి వ్యాధి గ్రస్తులకు మందులు ఇచ్చారు, అదిలాబాద్ నుండి వచ్చిన ప్రముఖ వైద్యుడు అభిజిత్ రోగులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. మారుమూల గ్రామాల్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ లో మరిన్ని చేపడుతామని ఈ సంధర్బంగా డీఎస్పీ నాగేందర్ అన్నారు. ఈ కార్యక్రమం విజవంతం కావడానికి కృషి చేసిన ఇచ్చోడ సీఐ బీమేష్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, గుడిహత్నూర్ ఎస్సై ఇమ్రాన్, ఇంద్రవెల్లి ఎస్సై సునీల్, గుడిహత్నూర్ వైద్యాధికారి శ్యాంసుందర్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

9
3102 views