logo

బనగానపల్లి, దొర్నిపాడు కోవెలకుంట్ల ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో జిల్లా ఎస్పీ కవాతు నిర్వహణ.... స్ట్రాంగ్ రూమ్స్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు....జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS

బనగానపల్లి, దొర్నిపాడు కోవెలకుంట్ల ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో జిల్లా ఎస్పీ కవాతు నిర్వహణ....

స్ట్రాంగ్ రూమ్స్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు....


ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలో తప్పవు....


జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS


నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి IPS గారు బనగానపల్లి , కోవెలకుంట్ల ,దొరనిపాడు, ఆళ్లగడ్డ, పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో, స్థానిక పోలీస్ అధికారులతో వారి సిబ్బందితో కలిసిపోలీస్ కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో జూన్ 4వ తేదీన జరుగునున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి అల్లర్లు , గొడవలు జరగకుండా ఉండేందుకు మరియు ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని, జిల్లాలో అన్ని స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు, ప్రజలతో మమేకమై, గ్రామాల్లో అందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని, జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని మరియు EVM లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎన్నికల కౌంటింగ్ రోజున అనగా జూన్ 4వ తారీఖున కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవ్వరు అనవసరంగా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకు రావద్దని, ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు మరియు వారి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు సమావేశాలు చేరాదని మరియు క్రాకర్స్ కాల్చుటకు ఎలాంటి అనుమతులు లేవని,రౌడీ షీటర్లు నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని , జిల్లాలోని ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని కోరారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ K. ప్రవీణ్ కుమార్, డిఎస్పి వై శ్రీనివాస్ రెడ్డి, ట్రైనింగ్ డిఎస్పి రఘువీర్, ఇన్స్పెక్టర్లు సుబ్బారావు ,తిమ్మారెడ్డి ,సుధాకర్ రెడ్డి ,ప్రీయతం రెడ్డి ,ప్రవీణ్ కుమార్ లు ,సబ్ ఇన్స్పెక్టర్లు రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి లు, ట్రెజరు సబ్- ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి స్థానిక పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు

3
3698 views