logo

నంద్యాల జిల్లా : అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం దళిత గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషం సీపీఐ

అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం దళిత గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషం సీపీఐ

నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి తన ఓట్ల రాజకీయం కోసం సినీ నటుడు అల్లు అర్జున్ ను పిలిపించడం జరిగిందని కానీ అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం స్థానిక జిల్లా పోలీసు అధికారులు కిందిస్థాయి దళిత గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషమని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది ఈ సమావేశములో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోట రాముడు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగరాముడు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ధనుంజయుడు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్.ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిప్రభాకర్. సిపిఐ జిల్లా సమితి సభ్యులు. వై. భార్గవ్. నారాయణ. బాలకృష్ణ.హరినాథ్.ఆర్ సామేలు. సురేషు.పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ... నంద్యాల జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధన ఉల్లగించినా పోలీస్ అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం జరిగిందని కానీ నంద్యాల జిల్లా కేంద్రంలో దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు, విపరీతమైన క్రైమ్ జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోకపోవడం అధికారుల చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. నంద్యాల పట్టణానికి ఎన్నికల ప్రచారానికై జిల్లా ఎన్నికల అధికారులతో ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సినీ నటుడు అల్లు అర్జున్ స్థానిక వైసిపి శాసనసభ్యులు రవిచంద్ర రెడ్డి కిషోర్ రెడ్డి పిలుచుకుని రావడం దానివల్ల వేలాదిమంది ప్రజలు సినిమా యాక్టర్ ను చూచేందుకు నిబంధనలు ఉల్లంఘించారని జిల్లా పోలీసు ఎన్నికల అధికారులు ఈవేమీ పట్టించుకోకుండా దళిత గిరిజన క్రైమ్ పార్టీ పోలీసులను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ఎలక్షన్ కమిషన్ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఎన్నికల, పోలీసు అధికారులు సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుళ్లను తిరిగి విధుల్లోకి తీసుకొని ఎన్నికల నిబంధనలు ఉలగించిన అధికార పార్టీ నాయకుల పై కేసులు నమోదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పై నాయకులు ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు చేశారు.

5
11614 views