logo

నంద్యాల : స్ట్రాంగ్ రూమ్ లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప‌రిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డా. కె. శ్రీనివాసులు

స్ట్రాంగ్ రూమ్ లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప‌రిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డా. కె. శ్రీనివాసులు

నంద్యాల, మే 26:-

సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా ఆర్జీఎం శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, మానిట‌రింగ్ రూమ్ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ గురించి అక్క‌డ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసిన జనరేటర్లు, యుపిఎస్ లను వినియోగిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేయబడిన సిసి ఫుటేజ్ లను 24/7 నిరంతర నిఘాతో పర్యవేక్షిస్తూ ఉండాలని భద్రతా సిబ్బందిని, సంబంధిత టెక్నిషియన్ లను ఆదేశించారు. నిరంతర ప్రసారాల్లో ఎలాంటి లోపాలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావడంతోపాటు తక్షణమే రెక్టిఫై చేసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. త‌నిఖీ అనంత‌రం సందర్శకుల రిజిష్టర్ లో సంతకాలు చేస్తూ అన‌ధికార వ్య‌క్తుల‌ను స్ట్రాంగ్ రూంలు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రవేశించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వచ్చేనెల 4వ తేదీన జ‌ర‌గ‌నున్న కౌంటింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల మేర‌కు అన్ని ర‌కాల భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జూన్ 1 నుండి 10 వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో వుంటుందన్నారు. అపోహలు, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాలు నమ్మకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

0
770 views