నంద్యాల జిల్లా : అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారా తస్మాస్ జాగ్రత్త - నంద్యాల టౌన్ డిఎస్పి ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా
26-05-2024
అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారా తస్మాస్ జాగ్రత్త......
నంద్యాల టౌన్ డిఎస్పి ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS ఆదేశాలమేరకు ఇతర ప్రాంతాలకు చెందిన వారు మరియు అసాంఘిక శక్తులు, అనుమానితులు ఎవ్వరు నంద్యాల పట్టణంలోని వసతి ఏర్పాటు చేసుకోకుండా ఉండేందుకు లాడ్జిలు ,డార్మెంటరీలు, ఫంక్షన్ హాల్లు, గెస్ట్ హౌస్ మొదలగు ప్రదేశాలలోనే కాకుండా ఇతరులు నంద్యాల పట్టణానికి వచ్చి వసతి ఏర్పాటు చేసుకునే ప్రతి వాటిపై నిరంతరం విస్తృత తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల డిఎస్పి ఎన్. రవీంద్రనాథ్ రెడ్డి నంద్యాల పట్టణంలోని వివిధ లాడ్జీలు డార్మెంటరీలు ,ఫంక్షన్ హాల్లు, గెస్ట్ హౌస్ లు మొదలగు వాటి యజమానులను పిలిపించి నంద్యాల 2 టౌన్ పోలీసు స్టేషన్ నందు సమావేశం ఏర్పాటు చేసి ,జూన్ 04 తేదీ ఎన్నికల కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకొని నంద్యాల పట్టణంలో గొడవలు, అల్లర్లు జరగకుండా ఉండేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ఇంటర్వ్యూకు , హాస్పిటల్ కు అత్యవసరము గా వచ్చిన వారికి మాత్రమే ఆశ్రయం కల్పించాలని,అసాంఘిక శక్తులకు మరియు అనుమానితులకు, బెట్టింగ్ ఆడేవారికి,తాగి తినేవారికి,జల్సాలు చేయు వారికీ ఆశ్రయం కల్పించవద్దని,మరియు ఎన్నికల నిబంధనల గురించి సమావేశానికి వచ్చిన సంబందిత లాడ్జి యజమానులకు DSP గారు తెలియజేశారు.పై నిభందలను ఎవ్వరూ ఉల్లంఘించిన అట్టివారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల టౌన్ DSP ఎన్. రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పి గారితో పాటు ఇన్స్పెక్టర్లు దస్తగిరి బాబు, నరసింహులు గారు, రాజారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ నవీన్, నంద్యాల పట్టణంలోని లాడ్జి, ఫంక్షన్ హాల్, గెస్ట్ హౌస్ లు వాటి యజమానులు పాల్గొన్నారు.