logo

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి... జిల్లా అదనపు కలెక్టర్

రాయల్ పోస్ట్/గుండాల : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్

బెన్ షాలోమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం గుండాల మండలంలోని బ్రహ్మణపల్లి, సుద్దాల గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపి, పిఏసిఎస్ కేంద్రాలలోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని, లారీలు, బస్తాల కొరత లేకుండా చూడాలని అన్నారు. వర్షాల వలన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎటువంటి ఇబ్బంది, భయపడాల్సిన అవ సరం లేదని తెలిపారు. కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికా రులు తగిన చర్యలు తీసుకొని ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎటువంటి తరుగు లేకుండా, కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీను, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు


1
1134 views