Honorable Nara Chandrababu Naidu addressed Muslim religious leaders in Visakhapatnam today.
ఈరోజు విశాఖపట్నంలో ముస్లిం మత పెద్దలను ఉద్దేశించి మాట్లాడిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర నలుమూలల నుండి మరీ ముఖ్యంగా రాయలసీమలాంటి సుదూర ప్రాంతం నుండి 24గంటల వ్యవధిలో వైజాగ్ చేరుకోవటం అభినందనీయం. అది కూడా కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (May Peace Be Upon Him) గారి వారసులైన వారు మీరందరూఆ అల్లాహ్ పై నమ్మకం ఉంచి నన్ను నమ్మి ముస్లిం మతపెద్దలు ఇక్కడకు ఈ సమావేశానికి విచ్చేయటం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ మన పార్టీ టీడీపీతో అనుబంధం ఇలాగే కొనసాగేలా పని చేసి ఇంకా మీ మన్ననలు పొందుతాను అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.మీరు ఒక్కొక్కరు వేల మంది ముస్లింలతో సమానం.మీరు పాటించే ఇస్లాం మతం నందు ప్రొఫెట్ (May Peace Be Upon Him) మీకు స్పష్టంగా హితబోధ చేస్తుంది ఈ విధంగా ఉన్నది అని నేను విన్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగితే దానికి మూడు స్టేజీలుగా విభజించారు I) మొదటి దశలో అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు అని చేతితో ఆపే ప్రయత్నం చేయాలి 2) రెండవ దశలో కనీసం మీ నోటి ద్వారా అయినా గాని తప్పుని తప్పు అని చెప్పి ఖండించాలి. 3) ఆఖరి దశ కనీసం మనస్సులమైన ఇది తప్పు అని అనుకోవాలి. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి లా అండ్ ఆర్డర్ విచ్చిన్నమైపోయి ఎస్సీలపై ఎస్టీలపై బీసీలపై ఎప్పుడూ మన రాష్ట్రంలో లేని విధంగా ముస్లిం మైనార్టీలపై సైతం 107 వరస సంఘటనలు జరగటం అన్యాయం కాదా?రాష్ట్ర ఖజానాను లూటి చేయడం అన్యాయం కాదా?రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేయటం అన్యాయం కాదా?అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడం అన్యాయం కాదా? హాజిరా దోషులను ఇప్పటివరకు పట్టుకోకపోవడం అన్యాయం కాదా?మిస్బాతో జరిగింది అన్యాయం కాదా?పట్టపగలు నడిరోడ్డుపై 78 సంవత్సరాల ఇబ్రహీంను నరికి వేయడం అన్యాయం కాదా? తన బాబాయిని తనే చంపుకొని నారాసుర రక్త చరిత్ర అని ఆ నెపం నాపై నెట్టివేసే ప్రయత్నం చేయడం అన్యాయం కాదా?ఎటువంటి తప్పు చేయకపోయినా నన్ను 53 రోజులు జైల్లో నిర్బంధించడం అన్యాయం కాదా?ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జైలుకు పంపుతుంది కాబట్టి చాలామంది ప్రశ్నించడం మానేశారు కానీ ఈ ఎన్నికలవేళ న్యాయానికి అన్యాయానికి వారధులుగా ఉండే మీరు న్యాయం వైపు నిలవాలని మీ అందరికీ మన ఇస్లాం ధర్మం ఆధారంగా పిలుపునిస్తున్నాను. మన మద్రసల నందు నేను విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా అందించాలన్న సంకల్పంతో మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాను. కానీ జగన్ అధికారంలో వచ్చినప్పటి నుండి మద్రసా విద్యా వాలంటీర్లకు ఒక నెల జీతం కూడా చెల్లించలేదు.మేము తీసుకు వచ్చిన ఈ వ్యవస్థను విద్య ప్రతి విద్యార్థి హక్కు కాబట్టి మరల దీన్ని కొనసాగిస్తాం.