logo

ప్రచారంలోదూసుకుపోతున్న సీఎం రమేష్ ఉమ్మడి పక్షాల నాయకుల్లో జోష్

ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్ దూసుకుపోతున్నారు. ప్రతీరోజూ సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తూ ఉమ్మడి పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతున్నారు.
ప్రచారంలో భాగంగా రమేష్ మంగళవారం అనకాపల్లి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియ ను పరిశీలించారు.అలాగే అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్భంగా నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోగల అల్లూరిసీతారామరాజు సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.అల్లూరి సేవలను కొనియాడారు.అల్లూరికి చిహ్నం గా భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ దేశభక్తితో అల్లూరి సీతారామరాజు పెద్ద విగ్రహాన్ని స్థాపించి , ప్రపంచ స్ధాయిలోనే అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర ఉద్యమ స్పూర్తిని గుర్తించేలా చేసారన్నారు.
అనంతరం జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్ డి యే కూటమి అయిన బీజేపీ,టీడీపీ,జనసేన అభ్యర్ధులను గెలిపించి ముచ్చటగా మూడవసారి మోదీని ప్రధానమంత్రి ని చేయాలని కోరారు.
కేంద్రంతో మంచి సంబందాలు కలిగిన వ్యక్తిగా తాను ఈ ప్రాంతానికి పరిశ్రమలు,నీటి ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
నర్సీపట్నం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధి అయ్యన్నపాత్రునికి ఎంతో అనుభవం ఉన్న నాయకునిగా మంచి పేరు ఉందని ,కనుక పార్లమెంట్ అభ్యర్ధి గా తనకు బీజేపీ కమలం గుర్తు పై,అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు కు టిడిపి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలన్నారు.రాత్రి 7 గంటలకు నర్సీపట్నం వేములపూడి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు.
మరోవైపు...అనకాపల్లి ఎన్నికల కార్యాలయం లో సీఎం రమేష్ తనయుడు రిత్విక్ ఆధ్వర్యంలో పలువురు ఇతరపార్టీ నాయకులు,కార్యకర్తలు సంఘీభావం తెలియచేసి,బీజేపీ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్,బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.//

2
4734 views