*నిర్మల్ జనజాతర బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ* పేదింటి బిడ్డగా ఇందిరమ్మ నిర్మల్ జనజాతర బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ*
*నిర్మల్ జనజాతర బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ*పేదింటి బిడ్డగా ఇందిరమ్మ ఇంట్లో పుట్టి పెరిగిన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం గొప్ప విషయమని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ,సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైన జనజాతర బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధాని చేయటానికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఆదిలాబాద్ ఆడబిడ్డగా,కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని తనను ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు.