Jagityal crime” కోడలి గొంతు కోసి చంపిన మామ
Jagityal crime” ఇద్దరు ఆడపిల్లల తల్లి, సొంత కోడల్ని గొంతు కోసి చంపి పరారయ్యాడు. ఈ దారణ ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి లో బుధవారం చోటు చేసుకుంది. రేచపల్లి చెందిన మౌనిక భర్త తిరుపతి రెడ్డి ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. మౌనిక తిరుపతిరెడ్డి భార్యభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు . మౌనిక పిల్లలతో రేచపల్లిలో ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున మానిక మామ రాజిరెడ్డి కత్తితో మౌనిక గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.