Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా.. వీడియో వైరల్
వీడియో వైరల్
Viral Video” పెండ్లంటేనే బంధుమిత్రుల సంబరాలతో సాగుతుంటది. ఇక పెండ్ల తంతు పూర్తికాగనే సాగనంపే కార్యక్రమం మరింత జోష్‌గా ఉంటంది. డప్పు సప్పుళ్లు, డీజే మోతలతో కుషి మామూలుగా ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి విషాదాలకు కూడా దారితీస్తాయి. అటువంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని నవ్లగడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మేనల్లుడి పెండ్లిలో కుషికుషిగా డ్యాన్స్ చేస్తున్న మేన మామ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా నెత్తిమీద కుండ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కుప్పకూలిపోవడంతో అందరూ ఆందోళను గురయ్యారు. వెంటనే దవాఖానాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో అక్కడే మరణించినట్టు తెలిపారు. Arvind Sharma అనే వ్యక్తి ఎక్స్ లో పోస్టు చేశారు.