logo

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు నిర్వహించాలి: డా. సంజయ్ జి. కోల్టే.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి. కోల్టే అన్నారు. శని వారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్, వ్యయ పరిశీలకులు , శంకర ఆనంద్ మిశ్రా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్,జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ రోహిత్ రాజ్ లతో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్, ప్రచారం, వ్యయ పర్యవేక్షణ బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కు 72 గంటల ముందు ఎంసిసి బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణా ఎంతో ఉపయోగంగా ఉంటుందని, శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ టర్నోవర్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వీప్ కార్యాచరణ విస్తృత పరచాలన్నారు.
పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్ మాట్లాడుతూ నిఘా పకడ్బందీగా చేపట్టాలని, సీజర్ లపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, లోకల్ పోలీసులు తనిఖీలు పెంచాలని ఆయన తెలిపారు.
వ్యయ పరిశీలకులు , శంకర ఆనంద్ మిశ్రా లు మాట్లాడుతూ
వ్యయ పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజర్ ల విషయంలో నియమ నిబంధనలు పాటించాలన్నారు.
జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ,* ఎన్నికల ఏర్పాట్లను గురించి వివరించారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్ లు రెండు (కొత్తగూడెం మరియు అశ్వారావుపేట) మన జిల్లాలో ఉన్నట్లు తెలిపారు. వాటికి సహాయ రిటర్నింగ్ అధికారులు గా ఆర్. డి. ఓ కొత్తగూడెం మరియు అధనపు కలెక్టర్ (రెవెన్యూ ) గారు ఉన్నారన్నారు. అందరు ఓటర్లకు ఓటరు సమాచార స్లిప్పుల పపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మ్యాన్ పవర్, ఎంసిసి, బందోబస్తు, శిక్షణ, ఎక్సైజ్, ఏఎంఎఫ్, రవాణా, వ్యయ పర్యవేక్షణ, కంట్రోల్ రూం, సువిధ అనుమతులు, పోస్టల్ బ్యాలెట్ తదితర నోడల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నియోజకవర్గంలో చేపడుతున్న చర్యల గురించి వివరించారు.ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన , నోడల్ ఆఫీసర్లు, ఎన్నికల సూపర్డెంట్లు ధారా ప్రసాద్, రంగ ప్రసాద్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

10
1812 views