logo

హొర్లిక్స్ ను హెల్తీ ఫుడ్ డ్రింక్ జాబితా నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ.

ఇంతకుముందు వరకు హార్లిక్స్ ఒక 'హెల్త్ ఫుడ్ డ్రింక్'.. ఇప్పుడది 'ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్'!! తృణధాన్యాలు, మాల్ట్, పాలకు సంబంధించిన బ్రాండెడ్ డ్రింక్స్‌పై 'హెల్త్ ఫుడ్ డ్రింక్' కేటగిరీని తొలగించాలని ఇటీవల ఈ-కామర్స్ కంపెనీలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదేశించింది.
అవి హెల్త్ డ్రింక్సే అని నిర్ధారించేందుకు న్యాయపరమైన క్లారిటీ లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వరకు హార్లిక్స్‌పై హెల్త్ డ్రింక్ అనే ట్యాగ్ ఉండేది. ఆ ట్యాగ్ ఉన్న పానీయాలను తమ ప్లాట్ ఫామ్‌లో విక్రయించేందుకు ఈ-కామర్స్ సంస్థలు అనుమతించడం లేదు.

దీంతో హార్లిక్స్‌ కంపెనీ తమ పానీయాలపై 'హెల్త్ ఫుడ్ డ్రింక్' అనే ట్యాగ్‌ను తీసేసి.. 'ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్' (FND) అనే కొత్త ట్యాగ్‌ను తగిలించింది. ఈమేరకు తమ ప్రోడక్ట్ హార్లిక్స్‌ను రీబ్రాండ్ చేశామని హిందుస్తాన్ యూనిలీవర్ ( HUL ) ప్రకటించింది. FND లేబుల్‌కు హార్లిక్స్ మారడం వల్ల.. ఆ ప్రోడక్ట్ గురించి మరింత ఖచ్చితమైన, పారదర్శకమైన వివరణ కస్టమర్లకు లభిస్తుందని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితమే 'బోర్న్‌విటా'లో, సెరెలాక్ ఉత్పత్తుల్లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అలాంటి పానీయాలకు హెల్త్ డ్రింక్స్ అనే ట్యాగ్‌ను(Horlicks Vs Health Label) కంటిన్యూ చేయొద్దని నిర్ణయించింది.

బోర్న్‌వీటాతో మొదలైన దుమారం

బోర్న్‌వీటాను చాలామంది పాలల్లో కలుపుకొని తాగుతుంటారు. చిన్నపిల్లలకు అయితే బోర్న్‌వీటాను రోజూ తాగిస్తుంటారు. పిల్లలకు బలం వస్తుందని.. బాగా పెరుగుతారని పేరెంట్స్ భావిస్తుంటారు. బోర్న్‌వీటా అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా వీటికి తగ్గట్టే ఉంటాయి. ఏకంగా స్పోర్ట్స్‌ స్టార్లతో ఈమేరకు ప్రచారం చేయిస్తుండటంతో నిజమేనని అందరూ నమ్ముతుంటారు. ఈ క్రమంలో బోర్న్‌వీటాకు ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. బోర్న్‌వీటా హెల్త్ డ్రింక్ కానే కాదని తేల్చి చెప్పింది.హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌వీటాను తీసేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఈ-కామర్స్ సంస్థలకు మార్గదర్శకాలు ఇచ్చింది. బోర్న్‌విటాను మాత్రమే కాకుండా అన్ని రకాల డ్రింక్స్‌ను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని ఉత్తర్వులను వెలువరించింది.

6
904 views