logo

భరత్ గెలుపు ఖాయం-జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు


రాజకీయ చరిత్రలో,ప్రజాపాలన లో దేశంలోనే క్రొత్త వరవడి సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు గాక అనేక ప్రజోపయోగ పధకాలు, అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరాయని,‌ అందువలన మే 13 న జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు పంపిన ప్రెస్ నోట్‌లోఅన్నారు. ముఖ్యంగా విద్యా వైద్యం విషయం లో జగన్ మోహన్ రెడ్డి చేసిన‌ ప్రయోగాలు దేశంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రధమ స్థానంలో నిలిపడమే గాకుండా,మిగతా రాష్ట్రాలు ఆలోచనలోపడవేశాయన్నారుముఖ్యంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిప్రతి జిల్లాకు కలెక్టర్, ఆర్.డి.ఓ,
డి.హెచ్.ఎం.వో మొదలగు అధికారులను నియమించి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చారన్నారు. సచివాలయాలు పెట్టి అధికారులను నియమించి, వాలెంటరీ వ్యవస్థ యార్పరిచి ప్రజలు వద్దకు పాలనను తీసుకుని వచ్చిన ఘణత జగన్మోహన్రెడ్డిదే నన్నారు.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన బూడి ముత్యాలు నాయుడు పార్లమెంటు సభ్యుడుగా, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మలసాల భరత్ కుమార్ అసెంబ్లీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని రమణ అప్పారావు అన్నారు.

8
1500 views