logo

పోక్సో కేసులో నిందితుడికి ఏడు సం.ల ఖైదు, రూ.2500/-ల జరిమానా* *- విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషను ఇన్చార్జ్ డిఎస్సీ డి.విశ్వనాధ్



విజయనగరం జిల్లా దిశ మహిళా పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన గొర్లె రాంబాబు (27సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు ఏడు సంవత్సరాలు ఖైదు, రూ.2,500/-లు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 22న తీర్పు వెల్లడించినట్లుగా దిశ మహిళా పోలీసు స్టేషను ఇన్చార్జ్ డిఎస్పీ డి.విశ్వనాద్ తెలిపారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన గొర్లె రాంబాబు అనే వ్యక్తి తే. 05-07-2021 దిన ఒక ఇంటిలోకి చొరబడి మైనరు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా దిశ మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, అప్పటి మహిళా ఎస్ఐ కే.టి.ఆర్.లక్ష్మి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను ప్రారంభం నుండి దిశ పోలీసులు సాక్షులను, ఆధారాలను ప్రవేశపెట్టడంతో నిందితుడిపై నేరారోపణలు రుజువుకావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడు గొర్లె రాంబాబుకు ఏడు సంవత్సరాల కారాగారం మరియు రూ. 2,500/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, దిశ ఇన్చార్జ్ డిఎస్పీ డి.విశ్వనాధ్, సిఐ బి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో దిశ పోలీసు స్టేషను కోర్టుహెచ్.సి. శ్రీనివాసరావు ప్రాసిక్యూషనులో సహాయ, సహకారాలను అందించారు.

*జిల్లా పోలీసు కార్యాలయం,*
*విజయనగరం.*

11
1280 views