logo

వారం రోజులు మంచినీటి సరఫరా ఉండదు ప్రజలు గమనించి సహకరించగలరు: కమిషనర్ రామప్పలనాయుడు



విజయనగరం జిల్లా. రాజాం.

రాజాo ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి
రాజాo మంచినీటి పథకం కు చెందిన రేగిడి మండలం పరిధిలో ఉన్న ఇన్ ఫ్రీలిటేషన్ బావుల్లో సిల్ట్ (పూడిక)పూడికతీత పనులు ఈనెల *25వ* తేదీ అనగా *గురువారం* నుంచి చేపట్టనున్నారు. మంచినీటి పథకం నిర్మాణం ప్రారంభం నుండి ఇప్పటివరకు పూడిక తీయడం జరగలేదు. దీనివలన 10 నుండి 12 అడుగుల లోతున బావుల్లో సిల్ట్ పేరుకు పోయి బురదనీరు రావడం జరుగుతుంది. దీనికోసం ఎంతమందిని తీసుకొచ్చి క్లీన్ చేయించాలి అనుకున్న ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుండి అనుభవజ్ఞులైన నిపుణులను తెప్పించి వారి ద్వారా సిల్ట్ తీయించే పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ప్రారంభమైతే నీరు ఇవ్వడo కుదరదు దీనివలన రాజాంలో కులాయిల ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. ఇటీవల కమిషనర్ రామప్పలనాయుడు, ఈ.ఈ దక్షిణామూర్తి మున్సిపల్ ఏఈ వెంకట్ హెడ్ వర్క్స్ ను సందర్శించి పనులు వెంటనే చేపట్టాలని కమిషనర్ రామప్పలనాయుడు ఏఈ వెంకట్ కి సూచించడం జరిగింది. ఈ సిల్ట్ క్లియరెన్స్ పనులు ఏ విధంగా చేస్తారంటే అనుభవజ్ఞులైన నిపుణులు ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో నదిగర్భంలోకి వెళ్లి బావుల్లోకి దిగి అక్కడ ఉన్న పూడిక ను బయటకు తీస్తారు ఈ పనులు రిస్క్ తో కూడుకున్నవి. ఈ పూడికి తీత పనులు వర్షాకాలంలో అయితే నీటిమట్టం ఎక్కువగా ఉండి లోపలికి వెళ్లడం కష్టమవుతుంది కావునఎండాకాలంలో అయితే నీటిమట్టం తక్కువగా ఉంటుంది అందువలన పూడికతీతకు ఇది సరైన సమయం అని తెలిపారు కావున *వారం రోజులు* మంచినీటి సరఫరా జరగదు, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని కమిషనర్ జె రామప్పలనాయుడు, ఏఈ వెంకట్ తెలపడం జరిగింది. కావున ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరడమైనది...

2
1645 views