logo

భానుడి సెగలు రాష్ట్రంలోహడలు 45 డిగ్రీలు దాటిన ఎండలు

హైదరాబాద్:ఏప్రిల్ 19
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే ఉష్ణోగ్రత అత్యధికం. 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైనే నమోదయ్యా యి. గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తా నికి హైదరాబాద్‌ వాతావ రణ కేంద్రం ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకా శముంది. ఆ జాబితాలో కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జయ శంకర్‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి.
నిన్న రాత్రి 10:30గంటల వరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మాసాగర్‌లో అత్యధికంగా 4.25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైం ది. నిర్మల్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, నారా యణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది.
మొత్తం మీద రాష్ట్రంలో 30 ప్రాంతంలో వర్షపాతం నమో దైంది. వచ్చే ఒకటెండ్రు రోజులు పలుజిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి...

0
944 views