logo

ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు

*ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

* జన సంద్రమైన రాజాం.
* ఎటు చూసినా పసుపు మయం.
* ప్రజాగళములో హోరెత్తిన జనం.

విజయనగరం జిల్లా. రాజాం.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు
నాయుడు ప్రజాగళం కార్యక్రమం రాజాం పట్టణం లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేసారు. ఎటు చూసిన జన సంద్రంమే,నాకు సంపద సృష్టించడం తెలుసు. జగన్మోహన్ రెడ్డి కి కూల్చడం తెలుసు, ఆయన పరిపాలన ప్రజా వేదిక కూల్చడం తో మొదలు పెట్టారని, ఉత్తరాంధ్ర పైన విజయ్ సాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి పెద్దరికం ఏమిటి అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిసి చెత్త బుట్టలో వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలకే దొరికేదని ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక కావాలంటే
ఐదువేల రూపాయలు చెల్లించవ
లసి వస్తుందని,కరెంట్ చార్జీలు, పెట్రోలు డీజిల్ ధరలు, నిత్యవసర సరుకులు దారుల పెంచి ప్రజలపై బాదుడే బాదుడు అని అన్నారు. నా సభలకు వచ్చిన జనం స్వచ్ఛందంగా వస్తారని, జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చే వారికి మందు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారని విమర్శించారు. నా పైన రాయి విసిరినప్పుడు ఏమి విమర్శలు చేయలేదని, ఇప్పుడు చిన్న గులకరాయి నాటకాన్ని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదనిఅన్నారు.ఆ పని నేనే చేయించానని బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం సభకు కరెంటు లేకుండానేను చేయించానని నాపై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు స్థాపించి నని, ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేయడం తో పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరిగిందని అన్నారు. 2000 ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించడానికి కృషి చేసానని అన్నారు. రాజాం ప్రాంతానికి చెందిన జిఎంఆర్ మన తెలుగువాడు ఎయిర్ పోర్ట్ నిర్వహించగలడని నిరూపించానని అన్నారు. నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే రాజాం పాలకొండ ప్రధాన రహదదారి రోడ్డు నిర్మిస్తానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతానని, రాజాంకు రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఐదు లక్షల ఉద్యోగాలకూ
నోటిఫికేషన్ ఇస్తామని, మెగా డీఎస్సీ చేపడతామని, 25,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్, సామాన్య వ్యక్తి అయినా కలిశెట్టి అప్పలనాయుడు ని విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చానని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తులు పార్లమెంట్ లోకి వెళితే ఉత్తరాంధ్ర గౌరవం దక్కుతుందని అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు

0
1925 views