logo

నాగులపల్లి నుండి వైసిపి నుండి జనసేనలో 30 మంది చేరిక

మునగపాక మండలం నాగులపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు 30 మంది ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సుందరపు విజయకుమార్ సమక్షంలో వీర మహిళ కె సరోజినీ, డొక్కా మురళి ఆధ్వర్యంలో మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు అరాచకాలపై ధ్వజమెత్తారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని రోడ్డు ఇరువైపులా గోతులు తవ్వేసి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనపరెడ్డి శ్రీనివాసరావు,టెక్కలి పరుశురాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏవి సత్యనారాయణ, కాళ్ల చంద్రమోహన్, ఆడారి శ్రీకాంత్, అల్లవరపు రమణబాబు, మాజీ సర్పంచ్ బాబ్జి, మాజీ సర్పంచ్ కారెడ్ల ప్రకాష్, మునగపాక గ్రామ అధ్యక్షులు సూరిశెట్టి అప్పలనాయుడు, వీర మహిళ సరస్వతి అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.//

129
15611 views