logo

ఉత్కంఠ గా సాగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు

బాపట్ల జిల్లా చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గౌరవ రమేష్ బాబు ఎన్నికయ్యారు.శనివారం చీరాల కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి పై 49 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ సందర్భంగా చీరాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కర్నేటి రవి,సహ న్యాయవాదులు రమేష్ బాబును అభినందించారు. కాగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పేదలకు కూడా న్యాయ సహాయం అందేలా చూస్తానని రమేష్ బాబు చెప్పారు.

0
0 views