వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం ప్రారంభం..
ఎన్నికల వేళ ప్రచారాలుతో నాయకులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.ఇదే కోవలో బాపట్ల జిల్లా చీరాల వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ అనునిత్యం ప్రజల్లో ఉంటూ తనదైన రీతిలో ప్రచారాన్ని సాగిస్తున్నారు.దీనికి సంబంధించి నూతనంగా నిర్మించిన నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి కరణం వెంకటేష్ లు ప్రారంభించారు. రేపటి నుండి ఎన్నికల కార్యకలాపాలు అక్కడ నుండే జరుపనున్నట్లు కరణం వెంకటేష్ తెలిపారు.