logo

AIMA వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అజయ్

Z6NEWS/వరంగల్ : అల్ ఇండియా మీడియా అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నిడిగొండ అజయ్ ఎన్నికయ్యారు. నిన్న ప్రకటించిన ఏఐఎంఏ జిల్లా అధ్యక్షుడి ఫలితాలలో వరంగల్ నుండి అజయ్ విజయం సాధించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అయన కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన పోరాడుతామని, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని చెప్పారు.

18
2045 views