logo

కేంద్రాలలో తప్పనిసరిగా శిక్షణకు హాజరు కాగలందులకు

భద్రాచలం నియోజకవర్గ సిబ్బంది – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ.
పినపాక నియోజకవర్గ సిబ్బంది - అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల, పాల్వంచ.
అశ్వారావుపేట నియోజకవర్గ సిబ్బంది - DAV పాఠశాల, KTPS కాలనీ, పాల్వంచ
కొత్తగూడెం నియోజకవర్గ సిబ్బంది - సింగరేణి మహిళా కళాశాల కొత్తగూడెం
ఇల్లెందు నియోజకవర్గ సిబ్బంది - శ్రీరామచంద్ర ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, లక్ష్మిదేవిపల్లి, కొత్తగూడెం.
శిక్షణ కేంద్రం లోనే పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫామ్ 12 లో విధిగా అప్లై చేసుకొనవలెను. ఆర్డర్ కాపీ, EPIC కార్డ్ జిరాక్స్ లతో హాజరు కాగలరు. సిబ్బంది స్వీకరించిన ఫోన్ మెసేజ్ లో ఏ విధమైన కరెక్షన్స్ వున్నా శిక్షణా కేంద్రం లో సంబందిత అధికారులకు తెలియచేసి సరిచేసుకునే వీలు వున్నది కావున గమనించగలరు. విధులకు కేటాయించబడిన సిబ్బంది తప్పనిసరిగా ఆయా శిక్షణ కేంద్రాలకు ఉదయం 8.45 నిమిషాలకు హాజరు కాగలరు. శిక్షణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సిబ్బంది నిర్ణీత సమయం లో హాజరు కాగలందులకు ఆదేశించనైనది. లేని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును.
జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

13
1678 views