logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బాల్య వివాహాలను అరికట్టాలి-సిడిపిఓ నిర్మల జ్యోతి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండలంలోని గర్భిణీ స్త్రీలకు, శ్రీమంతాలు ఆరు నెలలు దాటిన పిల్లలకు, అన్నప్రాసన వేడుకలు సిడిపిఓ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. సిడిపిఓ నిర్మల జ్యోతి మాట్లాడుతూ అంగనవాడి సెంటర్లు లో పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు స్పర్శల గురించి చెప్పాలి. బ్యాడ్ టచ్ ,గుడ్ టచ్ గురించి క్లుప్తంగా వివరించాలి. గ్రామాలలో ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పెళ్లిళ్లు నిర్వహిస్తే వెంటనే సమాచారం అందించాలని , మధ్యలో చదువు ఆపేసిన పిల్లలను వెంటనే గుర్తించి స్కూళ్లలో చేర్పించాలి. చిన్నపిల్లల సమస్య ఎటువంటిదైనా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి ఎప్పుడైనా ఫోన్ చేసి సమాచారం అందించడం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు గంగాజలం, సుజాత, రాణి, నాగమణి, లక్ష్మీనరసమ్మ, లలిత, ప్రభుత్వ హెల్త్ విజిటర్ పద్మ, గ్రామంలోని అంగన్వాడీ టీచర్స్, ఆయాలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ పాల్గొన్నారు.

163
9215 views

Comment