logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

HM ను బెదిరించిన విలేకరులపై కేసు నమోదు..

కారేపల్లి : డ్యూటీలో ఉన్న హెచ్ఎం ను బెదిరించిన ఖమ్మంకు చెందిన ఇద్దరు విలేకరులపై కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మంకు చెందిన ఆధాబ్ హైద్రాబాద్ పేపర్ విలేకరి గోవింద వెంకటేశ్వర్లు, తెలంగాణ కెరటం పత్రిక విలేకరి జిల్లపల్లి వెంకటేశ్వర్లు ఇద్దరూ కలిసి కారేపల్లి బీసీ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న గణపారపు వెంకటేశ్వర్లు ను కలిసి టీచర్ల హాజరు రిజిస్టర్ చూపించాలని అడిగారు. రిజిస్టర్ లు ఎవరికీ చూపించకూడదని తిరస్కరించారు. రిజిస్టర్ చూడకూడదన్నా ఆగకుండా హెడ్మాస్టర్ ను బెదిరించి రిజిస్టర్ ను, అందులో ఉన్న పత్రాలను ఫొటో తీసుకున్నారు. దౌర్జన్యంగా ఇద్దరు విలేకరులు వ్యవహరించి హెడ్మాస్టర్ ను బెదిరింపులకు పాల్పడ్డారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై రాజారామ్ ఆ ఇద్దరు విలేకరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

136
18460 views

Comment