logo

గంజాయి రవాణాపై వ్యూహాత్మక దాడులు

532 కేజీల గంజాయి స్వాధీనం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

కొయ్యూరు,కోస్తాటైమ్స్ (మార్చి -20) : గంజాయి అక్రమ రవాణా పట్ల పోలీస్ వ్యవస్థ వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించి గంజాయి రవాణా నిర్మూలనకు ఎనలేని కృషి చేస్తున్నారు.కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామ సమీపంలో పోదలచాటున దాచిపెట్టిన 532 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చింతపల్లి అదనపు ఎస్పి కె.ప్రతాప్ శివ కిషోర్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ, ముంప ఎస్సై లోకేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వ్యూహాత్మకంగా తాడులు నిర్వహించారు.17 బస్తాలతో 532 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు.పాంగి సుందర్ రావు, మాణిక్యం,వంతలా చిన్న అనే ముగ్గురుని కస్టడీలోకి తీసుకొన్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ తుహిన్ చ్నిహ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రకటనలో వివరించారు...

10
3005 views