logo

*జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం* *ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరం* *జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్*

*శ్రీకాకుళం, మార్చి 16, : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్  స్పష్టం చేశారు. ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్ పి జి ఆర్ రాధికతో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనావలి అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, మే 13న ఎన్నికలు జరిగి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన వివరిస్తూ జిల్లాలో 18,63520  మంది ఓటర్లు ఉండగా వారిలో 9,23,498 మంది పురుషులు, 9,39,891 స్త్రీల ఓటర్లు ఉన్నారన్నారు. అదేవిధంగా 131 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
జిల్లాలోని 2357 పోలింగ్  పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఓటర్ల సౌకర్యార్థం ఆయా పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణం వంటి అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు.
అదేవిధంగా 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్న ఎక్కువ అంగవైకల్యం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు హోం ఓటింగ్ ద్వారా  సౌకర్యం కోరుకుంటే కల్పిస్తామన్నారు, ఇది ఐచ్చికమని పోలింగ్ కేంద్రంలో ఓట్ వేయడమే ప్రాధాన్యం అని తెలిపారు. అయితే అభ్యర్థుల నామినేషన్ల ముందు రోజు వరకు కూడా అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం జరుగుతుందన్నారు.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు, సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదన్నారు.
*కంప్లైంట్ మానేజ్మెంట్ సిస్టం*
*ఈ విభాగంలో ప్రజల నుండి ఫిర్యాదులు
స్వకరణకు
*1)టోల్ ఫ్రీ నెంబర్ 18004256625*
*2)1950 హెల్ప్ లైన్* (ఉదయం 10.00 నుండి సాయంత్రం 05.00 వరకు)
*3) డిసిసి ఫోన్ నంబర్స్ 08942-240606 / 08942 - 240589 / 08942 - 295084.
Email: complaintcell9@gmail.com*
*5) నేషనల్ గ్రీవన్స్ సర్వీస్ పోర్టల్,*
*6) సి - విజిల్ ద్వారా వచ్చే ఎన్నికల ఫిర్యాదులు*

0
1318 views