ఎమ్మేల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి ఘనంగా స్వాగతం పలికిన మహిళలు
తాళ్లూరు , వెంకటాపురం గ్రామంలో
కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో 15 లక్షల రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మేల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్బంగ ఎమ్మేల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని గడిచిన 90 రోజుల్లోనే ప్రభుత్వ పథకాలు అమలుచేస్తున్నoదుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము. సత్తుపల్లి నియోజకవర్గం లో అవసరం వున్న ప్రతి చోట బోర్లు వెయ్యటం జరుగుతుంది. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు సమాకురుస్తున్న ఖమ్మం జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలియచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలు, యువతకు, రైతులుకు పెద్ద పీట వేస్తున్నారని. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, కల్లూరు మండలం, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.