
సిటీ క్లబ్ అక్రమ నిర్మాణాలపై స్పందనలో ఫిర్యాదు
నర్సీపట్నం,కోస్తాటైమ్స్ (మార్చి -11) : ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి లేకుంటే ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం అంటున్న ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణసమితి పులిగా రామ్మోహన్ మురళి.ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఈ సందర్భంగా సోమవారం ఆర్డీవోకు స్పందనలో ఫిర్యాదు చేశారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు చెందాల్సిన నర్సీపట్నం నడిబొడ్డులో ఉన్న సర్వే నంబర్ 357/ 3లో 55 సెంట్లు గ్రామ కంఠంను సిటీ క్లబ్ గా మార్చి కొందరు అక్రమార్కులు జూదశాలగా మార్చారని కాలక్రమంలో 11 షాపులు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించి అక్రమార్జనకు పాల్పడు తున్నారన్నారు.ఈ సిటీ క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులలో స్పందన లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు. మునిసిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కనీసం పట్టించుకోలేదని అన్నారు.అక్రమంగా నిర్మిస్తున్న ఈ షాపులకు ఎటువంటి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయొద్దని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి.శ్రీనివాస్, వంకదార శ్రీను తదితరులు పాల్గొన్నారు...