logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Andhra Pradesh 10th Class Hall Tickets Download 2023 year

ఏపీలో 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యాశాఖ పదో తరగతి హాల్‌ టికెట్లను సోమవారం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. 10వ తరగతి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాను­న్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు.. 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి మళ్లీ పరీక్ష రాస్తున్నవారు 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.

టైమ్‌టేబుల్‌

మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20- ఇంగ్లిష్
మార్చి 22- మ్యాథ్స్‌
మార్చి 23- ఫిజికల్ సైన్స్
మార్చి 26- బయాలజీ
మార్చి 27- సోషల్ స్టడీస్
మార్చి 28- ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
మార్చి 30- ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), ఓకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.

139
9782 views

Comment