logo

సదరం రెన్యువల్ స్లాట్ బుక్ కావడం లేదు కలెక్టర్ స్పందించాలి, సిద్దుల పాండు

Hindu 9 News vikarabad Telangana: వికారాబాద్ జిల్లా లో వికలాంగుల సదరం రెన్యువల్ స్లాట్ బుక్ కావడం లేదని దారూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు పాండు అవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే తన భార్యకు ఆటో ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోవడంతో హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోవడం జరిగిందని అయితే తన భార్య కాళ్లలో రాడ్స్ వేసి ఉన్నాయని రాడ్స్ సాయంతోనే తన భార్య కొంత నడవగలుగుతున్నారంటూ వికలాంగుడు పాండు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ని గత సంవత్సరం తాండూర్ జిల్లా ఆసుపత్రికి సదరం సర్టిఫికెట్ నిమిత్తం వెళ్లడంతో సంబంధిత డాక్టర్లు ఎక్సెర్లు పరిశీలించి ఒక సంవత్సరం పాటు సదరం సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిందని పాండు తెలిపారు. అయితే సంవత్సరం పూర్తి కావడంతో తన భార్య కాళ్లలో తిమ్మిర్లు రావడం నొప్పులు అధికం కావడంతో తన భార్యకు మళ్లీ సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కావడంలేదని వారు పేర్కొన్నారు.
ఇప్పటికైనా వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

14
838 views