బైటి పేట సామూహిక మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించండి.
బైటి పేట సామూహిక మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించండి.
నంద్యాల పట్టణంలోని 42 వ వార్డులో సామూహిక మరుగుదొడ్లు పని చేయక అక్కడి పేద మహిళలు ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నాయకులు గానీ అధికారులు గానీ పట్టించుకోవడంలేదని ఈరోజు సిపిఎం పార్టీగా ఇంచార్జ్ కమిషనర్ అయినా అంకిరెడ్డి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు మాట్లాడుతూ బయట పేట మరుగుదొడ్లు మూడు నెలల నుంచి నీళ్లు రాక కొళాయిలు విరిగిపోయి తలుపులు పనిచేయక మహిళలు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే అధికారులు గానీ ఆ వార్డ్ కౌన్సిలర్లు గాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని వారు అన్నారు, కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని వారు అన్నారు ,బయట పేట, పెద్ద బండ, చాకలిపేట, తెలుగు పేట నుండి 500 కుటుంబాలు యొక్క మరుగుదొడ్లను ఉపయోగించుకుంటున్నాయని వారు అన్నారు పనిచేయక మహిళలు బహిరంగ ప్రదేశాలలో కూర్చోవాల్సి వస్తుందని వారు అన్నారు ,కాబట్టి తక్షణమే బయట పెట్ట మరుగుదొడ్లను రిపేరు చేయించి మా యొక్క మహిళల మానాలను కాపాడాలని వారు అన్నారు ,ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అక్కడే కూర్చుంటామని వారన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు శివ ,మహిళా నాయకురాలు భాను ,విజయ ,తిరుపాలమ్మ ,వెంకటరంగమ్మ ,నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.