logo

ఏపీ మాస్ ఆధ్వర్యంలో నీరు పారిశుధ్యం మరియు పరిశుభ్రత పై అవగాహన సదస్సు

ఈరోజు స్థానిక మెప్మా ఆఫీస్ నందు CMM జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత అంశాల గూర్చి ఏపీ మాస్ ఆధ్వర్యం లో రెండు రోజు రెండో బ్యాచ్ వారీగా రీ ఫ్రెష్ రిసోర్స్ పర్సన్స్ శిక్షణ కార్యక్రమం జరిగింది. , వాటర్.ఆర్గ్- ఏపీ మాస్ ఆధ్వర్యంలో నీరు పారిశుధ్యం మరియు పరిశుభ్రత పై జిల్లా వాష్ కోఆర్డినేటర్ షణ్ముఖ గారు మాట్లాడుతూ నీరు పారిశుధ్య మరియు పరిశుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కలిపించి కచ్చితంగా ఆరోగ్య అలవాట్లు పాటించాలని అలాగే సంఘ సమావేశాలలో వాష్ అలవాట్ల గూర్చి ఒక అజెండా పాయింట్ లాగా పెట్టుకొని సభ్యులకు వాష్ అలవాట్లను పాటించేలా ప్రోత్సహించాలని తెలిపారు. సి ఎం ఎం జయవర్ధన్ గారు గారు మాట్లాడుతూ శుభ్రమైన నీరు, సక్రమమైన మరుగుదొడ్ల వాడకం మరియు హ్యాండ్ వాష్ అలవాట్ల వల్ల అనారోగ్యాలు దరికి రావని ఈ విషయాల పట్ల సంఘాలలో అవగాహన కల్పించాలని ఆలాగే స్వచ్ఛ ఎమ్మిగనూరు మనం నిర్మిద్దాం అని చెప్పారు, వాష్ కోసం ఎవరైనా సభ్యులు అప్పు అడిగితే తప్పకుండా ఇవ్వాలని అంతర్గత అప్పులు వాష్ అవసరం ఉన్న వారికి తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. మనం స్వచ్ఛ ఎమ్మిగనూరు దిశగా అందరూ మహిళలు ముందుకు వెళ్ళాలని దానికి సహకరించాలని తెలిపారు.అలాగే మెప్మ సివోస్, ర్పీస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు...

6
764 views