విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువైపోయింది : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్*
విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువైపోయిందని, రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, సీరియల్లో ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని మండిపడ్డారు.సమయపాలన లేకుండా విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదని, దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్, సర్పంచ్ లక్ష్మన్న, మాజీ మండలాధ్యక్షుడు రాజన్న, మాజీ మండల ఉపాధ్యక్షులు రమణ చినబాబు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు