logo

జగన్ పాలనపై మండిపడ్డ మదనపల్లి మైనార్టీ నాయకులు*

*జగన్ పాలనపై మండిపడ్డ మదనపల్లి మైనార్టీ నాయకులు*


మైనార్టీ ప్రజల ఓట్లు కోసం తప్ప, వారి అభివృద్ధికి నోచుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని, స్టేట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ అన్నారు. నేడు మదనపల్లిలోని టిడిపి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులను కానీ, విద్యార్థులను కానీ, తమ పార్థనా మందిరాల అభివృద్ధి కానీ.. ఎటువంటి సంక్షేమ పతకాలను అమలు చేయకపోగా, గంతంలో చంద్రబాబు నాయుడు అమలు చేసిన పతకాలను సైతం నిలిపివేయడం, మైనార్టీల పట్ల, జగన్ కు ఉన్న నిబద్దతకు నిలువటద్ధం అని ఏద్దేవా చేశారు. లోకల్ గా ముస్లిం MLA ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, అధికారం కోసం మాత్రమే మైనార్టీ లను జగన్ వాడుకుంటున్నారని విమర్శించాడు. ఇకనైనా ముస్లిం ప్రజలు మోసపోకుండా, రానున్న ఎన్నికల్లో టిడిపి ని గెలిపించి, మైనార్టీ ల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.

4
1400 views