3000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన బిజెపి నేత.
నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బిజెపి కార్యాలయంలో 3000 మంది మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన నంద్యాల జిల్లా బిజెపి కన్వీనర్ అభిరుచి మధు. నంద్యాల బిజెపి కన్వీనర్ ఇదివరకు గోస్పాడు మండలంలో మహిళలకు దాదాపుగా 1200 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వృద్ధులు మహిళలు మాట్లాడుతూ పట్టణంలో అభిరుచి మధు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయనకు అంతా మంచి జరగాలని, కలకాలం చల్లగా ఉండాలని దీవించారు. ఆత్మకూరుకు చెందిన బిజెపి నాయకురాలు షబానా, జ్యోతి, శిల్ప, స్వాతి తదితరులు పాల్గొన్నారు.