logo

ఎమ్మెల్యే రేసులో.. మరో కృష్ణుడు.....

*ఎమ్మెల్యే రేసులో.. మరో కృష్ణుడు తెరపైకి వచ్చాడు..*

*🇸🇱 గూడూరు వైసీపీ ఆశావాహుల్లో అయోమయం*

----------------------------------------------
*(Kota-Vakadu-Chittamuru)*
--------------------------------------------★

*🔵 తిరుపతి జిల్లా గూడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం*

*⚪ ఆశావాహులే ఆశ్చర్యపోయేలా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి*

*🟢 రేసులో కాదు కదా ఊసులో కూడా లేని కొత్త అభ్యర్థి పేరు*

*🔵 అతనే అభ్యర్థి ఐతే వేరే పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా వైసీపీ నాయకులు*

*⚪ బీఫామ్ ఇస్తేనే వస్తాడు.. ఎన్నికల ఫలితాల వరకు ఫామ్ లో ఉంటాడు*

*🟢 ఆశావాహుల లిస్టులోకి పేరు చేరడాన్ని జీర్ణిమచుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు*

*🔵 ఓడితే మాయం.. ఇక ఇదేళ్ల తర్వాతే మళ్ళీ పునఃదర్శనం*

*⚪ రాజకీయాలంటే టైం పాస్.. పార్ట్ టైం రాజకీయాలు అతని హాబీ..*

*🟢షార్ట్ కట్ లో ఇంస్టెంట్ గా ఎమ్మెల్యే అయిపోవాలనేది డ్రీమ్*

*🔵 2009 లో భంగపాటుకు గురవ్వడంతో నెరవేరని డ్రీమ్*

*⚪ ఓడినా ప్రజాక్షేత్రంలో ఉన్న పాశింకు పోటీగా పార్ట్ టైం పొలిటిషియన్ ఆ..?*

*🟢 వైసీపీ శ్రేణుల్లారా.. బీ అలెర్ట్.. మీ కంచుకోటను కాపాడుకోండి*

*🔵 చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.. ఏదైనా మీ చేతుల్లోనే..!*
----------------------------------------------

*గూడూరు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం.. తెలియని అయోమయం నెలకొంది. వైసీపీ అభ్యర్థిగా రోజుకొక పేరు తెర పైకి వస్తుండడంతో వైసీపీ ఆశావాహుల్లో అభద్రతా భావం మొదలైంది.. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే సీటు ఖాళీ కానుండడంతో పోటీ పెరిగింది.. పైకి తనకంటే తనకే ఎమ్మెల్యే టికెట్ అని ధీమా వ్యక్తం చేస్తున్నా.. అధిష్టానం ఎవరికి ఇస్తుందో తెలియక నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.*

*2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఈసారి టికెట్ లేకపోవడంతో కొత్త అభ్యర్థిని నిలిపే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రముఖంగా మూడు నాలుగు పేర్లే వినపడుతున్నా ఆశావాహుల లిస్టు పెద్దదిగానే ఉంది. ప్రయత్నాలు చేయడంలో ఎవ్వరూ తగ్గడం లేదు. జగన్ పేరు ప్రకటించేవరకూ విశ్రమించేటట్టు లేరు. పార్టీని నమ్ముకున్న వారు.. ప్రజాసేవలో పేరు పొందిన ఓ అధికారి.. ఇంకా స్థానిక, స్థానికేతర ప్రజాప్రతినిధులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఆ ఉన్నతాధికారి తన పని తాను చేసుకుంటూ పోతున్నా.. మిగిలిన ఆశావాహులు మాత్రం ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతున్నారు.*

*గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారిలో అధికారి, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజాక్షేత్రంలో ఈ పాటికే దూసుకెళ్లారు. స్థానిక, స్థానికేతర అంశాలు ప్రక్కన పెడితే అందరూ బలవంతులే.. బీ ఫామ్ తెచ్చుకోగలిగేంత సామర్ధ్యం ఉన్నవారే.. వీళ్ళందరికీ అర్హతా ఉంది.. అవకాశమూ ఉంది.. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది.. అసలు రేసులో ఊసే లేని ఓ నాయకుడి పేరు ఆదివారం రాత్రి కొత్తగా తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా అన్ ఎక్స్ పెక్టెడ్..*

*ఈ కొత్త నాయకుడు రాజకీయాలకు కొత్తేమి కాదు.. పోటీకీ కొత్త కాదు.. సీనియర్ నాయకుడే కాని.. సిన్సియర్ మాత్రం కానే కాదు.. టికెట్ కన్ఫర్మ్ అయితేనే వెలుగులోకి వస్తాడు.. ప్రజల్లోకి వస్తాడు.. గెలిస్తే ఏమో కానీ.. ఓడాకా ఇక అంతే.. బ్యాక్ టూ హిజ్ ఓన్ యాక్టివిటీస్.. ఇలా ఆన్ అండ్ ఆఫ్ రాజకీయాలు చేయడం.. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు శ్రమతో చెలగాటమాడటం హాబీనే.. రాజకీయమంటే గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండాలి.. ప్రజా ఉద్యమాలు చేయాలి.. పార్టీ శ్రేణులకు అండగా ఉండాలి.. ఇతనిదంతా పార్ట్ టైంలో పార్ట్ టైం రాజకీయాలు.. ఇంస్టెంట్ గా ఎమ్మెల్యే అయిపోవాలి.. కార్యకర్తలు కష్టపడి.. ఆశావాహులు చెమటోడ్చి నిర్మించుకున్న కంచుకోటలో పాగా వేయాలి.. చీమలు నిర్మించిన పుట్టలో పాములా దూరడంలా అన్నమాట.. బహు సరదా.. ఎక్కడ వంటపెట్టుకున్నాడో.. గాడ్ ఫాదర్ ఎవరో గానీ.. తలపండిన రాజకీయ దురంధురలకు సైతం అందని అంచనాలతో ఎన్నికల వేళ గద్దలా బీ ఫామ్ ఎగరేసుకుపోవడంలో బహు ట్యాలెంటెడ్.. 'ఘనాపాటీ'నూ..! ఈయన రాజకీయ ప్రస్థానం అంతా షార్ట్ కట్, రాంగ్ రూట్ వ్యవహారాలే..*

*ఇప్పుడు ఇతగాడి గత చరిత్రలోకి తొంగి చూద్దాం..!*
----------------------------------------------
*అది సరిగ్గా 2008 సంవత్సరం.. ఓ ప్రముఖ నటుడు సీనియర్ ఎన్టీఆర్ ని అనుసరిస్తూ 9 నెలల్లో అధికారం చేజిక్కించుకునేందుకు పార్టీ పెట్టాడు.. పార్టీ పేరు.. ఫలితం అందరికీ తెలిసిందే.. టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టారు. నిద్రాహారాలు మాని వందలాది సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల వేళ గూడూరు నుండి ఎన్నో పేర్లు వినిపించాయి. కోట్లు ఖర్చు పెట్టినోళ్లు ప్రజాభిమానం సంపాదించోనోళ్లు.. టికెట్ కోసం ఎదురుచూసారు.. ఎలా దక్కించుకున్నాడో ఏమో బీ ఫామ్ ఎవరూ ఊహించని వ్యక్తి చేతిలోకొచ్చింది.. ఆ ఎన్నికల్లో సుమారు 27 వేల ఓట్లు ఆ పార్టీకి.. కొద్దినెలల తర్వాత అభ్యర్థి అజ్ఞాతంలోకి.. రాజకీయ సన్యాసం తీసుకున్నాడంటే పొరబడినట్టే.. మళ్ళీ తదుపరి ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించడం, రాదనే సంకేతాలు వస్తే మౌనంగా ఉండడమే మేలు అనుకున్నాడేమో.. అనుకున్న సమయం రానే వచ్చింది.. మరో వంద రోజుల్లో 2024 ఎన్నికలు జరిగే వాతావరణం నెలకొంది.. గూడూరు వైసీపీలో ముసలం.. అలజడి.. రేగింది.. ఇదే అదును అనుకున్నాడేమో.. మళ్ళీ అదే తరహా లాబీయింగ్.. షార్ట్ కట్ రాజకీయాలు మొదలు పెట్టేసాడు.. రాత్రికి రాత్రే.. గూడూరు మొదలుకొని తీర ప్రాంత మండలాలన్నీ నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలతో నింపేశాడు.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రజలు, నాయకులకు అతను శుభాకాంక్షలు చెప్తున్నట్టు కాకుండా.. గూడూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు సంకేతం.. సారాంశం..*

*పాశిం కు పోటీగా టైం పాస్ పొలిటిషియన్ ఆ..?*
----------------------------------------------
*గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలో ఉన్న.. ఉంటున్న టీడీపీ అభ్యర్థి పాశింకు సునీల్ కుమార్ కు పోటీగా.. ఆన్ అండ్ ఆఫ్ రాజకీయాలు చేసే పార్ట్ టైం పొలిటిషియన్ అదీ టైం పాస్ రాజకీయాలు చేసే నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడిని వైసీపీ అభ్యర్థిగా నిర్ణయిస్తే గెలుపు సంగతి దేవుడెరుగు అంతా దుప్పటి కప్పుకుని నిద్రపోవాల్సిందేనని రాజకీయ మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులు అప్రమత్తం ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. అభ్యర్థి ఇతనే అయితే గూడూరు వైసీపీకి ప్రమాద ఘంటికలు మ్రోగినట్టేనని హెచ్చరిస్తున్నారు.. మరో రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ గజిబిజి గందరగోళం గూడూరు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. వైసీపీ నాయకులారా.. బహు పరాక్..!*

4
144 views